![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -712 లో... కావ్యతో రాజ్ రిసార్ట్ కి వెళ్తున్నాడని యామిని అనుకుంటుంది. కావ్యకి ఫోన్ చేసి నీ వైపుకి తిప్పుకోవాలనుకుంటున్నావు.. నేను నీ ప్లాన్ చెడగొడతానంటూ కావ్యతో యామిని ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ తో ఫోన్ లో మాట్లాడుతుంది కావ్య. రిసార్ట్ లో అన్ని ఏర్పాట్లు చేసావా అని కనుక్కుంటుంది. కావ్య రెడీ అయి హాల్లోకి వచ్చి అపర్ణ వాళ్ళకి చెప్తుంది. ఇదేం విడ్డురం రాజ్ లేడని బాధపడకుండా అలా తిరుగుతుందని రుద్రాణి అంటుంటే.. తన మాటలు పట్టించుకోకుండా కావ్య బయల్దేర్తుంది.
కావ్య వెనకాలే రాహుల్, రుద్రాణి వస్తారు. ఏంటి అలా డౌట్ గా చూస్తున్నారని కావ్య అడుగుతుంది. నీకు పార్టీ కల్చర్ నచ్చదు కదా మరి ఎందుకు వెళ్తున్నావని రాహుల్ అడుగుతాడు. నాకు అన్ని నచ్చుతాయని కావ్య సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. దీన్ని అంత తేలికగా వదలకూడదు. ఎక్కడికి వెళ్తుందో కనుక్కోమని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత రాజ్, కావ్య ఒకే కార్ లో రిసార్ట్ కి బయల్దేర్తారు. మరొకవైపు కళ్యాణ్, అప్పు కలిసి రిసార్ట్ దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తారు. సందీప్ తన భార్యకి రాజ్ గురించి చెప్తారు. తన ఫ్రెండ్స్ కి రాజ్ గురించి చెప్తారు.
తరువాయి భాగంలో కావ్య రాజ్ రిసార్ట్ కి చేరుకుంటారు. అప్పుడే కళ్యాణ్, అప్పు ఇద్దరు రాజ్ ని కలిసి మాట్లాడుతారు. నిన్ను అన్నయ్య అనుకుంటున్నానని కళ్యాణ్ అనగానే.. సరే నిన్ను తమ్ముడు అనుకుంటానని రాజ్ అంటాడు. అప్పు, కళ్యాణ్, కావ్య కలిసి రాజ్ కి గతం గుర్తుచేసే ప్రయత్నం చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |